అగ్రిగోల్డ్ అంశంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములపై హౌస్ కమిటీ విచారణకు ప్రభుత్వం సిద్ధమని తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే హౌస్ కమిటీతో కాదని... సిట్టింగ్ జడ్డితో జ్యుడీషియల్ విచారణ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో డిమాండ్ చేశారు.