ప్రజలకు మేలు చేస్తే మద్దతు.. లేకుంటే ఉద్యమం | will-support-kcr-if-he-is-for-people-orelse-will-fight-says-ponguleti-srinivasa-reddy | Sakshi
Sakshi News home page

Oct 16 2014 4:32 PM | Updated on Mar 21 2024 7:46 PM

తెలంగాణలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని ఎలా బలోపేతం చేయాలోననే అంశంపై చర్చించినట్లు తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల్లో కూడా వైఎస్ఆర్ మీద ప్రేమ, ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని, ప్రజల మనసు ఎరిగి పరిపాలించింది వైఎస్ఆర్ మాత్రమేనని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే తాము బేషరతుగా మద్దతు ఇస్తామన్నారు. కానీ అలా చేయకపోతే మాత్రం ఉద్యమబాట తప్పదని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటం వల్ల వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, విద్యుత్ కోతలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల వారీ సమీక్షలు పూర్తయిన తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని తాము నిలదీస్తామన్నారు. త్వరలోనే రైతు సమస్యలపై గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్లను కలుస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement