బ్యాంకులకు వేలకోట్లు రుణాలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా ఇలా అరెస్ట్ అయ్యారో లేదో వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు. గతంలో ఏప్రిల్ నెలలో అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇదే విధంగా జరిగింది. ప్రస్తుత పరిణామాల ప్రకారం ఇప్పట్లో భారత్‌కు మాల్యాను తీసుకోచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వివిధ బ్యాంకులకు రూ.9వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా లండన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, మనీ లాండరింగ్ కేసులో ఆయనను తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఈడీ) మంగళవారం లండన్‌లో అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీంతో ఇక మాల్యాను అక్కడి భారత ఈడీ, సీబీఐ అధికారుల బృందం ఇండియాకు తీసుకొస్తారనుకునే లోపే మాల్యాకు బెయిల్ లభించింది