మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రధాన అనుచరులు శాఖమూరు నారాయణ ప్రసాద్తోపాటు మాజీ జడ్పీటీసీ,ఎంపీటీసీలు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని లోటస్పాండ్లో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వారు చేరారు. మాజీ మంత్రి మోపిదేవి జైలుకు వెళ్లి ఏడాది అయింది. అయిన ప్రస్తుత ప్రభుత్వం ఆయన్ని విడుదల చేసేందుకు ఏమాత్రం ప్రయత్నించటంలేదు. దాంతో మోపిదేవి సొంత సోదరుడు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మోపిదేవి సోదరుడు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే.