మంగళవారం పార్లమెంటు ఉభయ సభల సమావేశాల్లో ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా లోక్సభలో వ్యాపం, లలిత్ గేట్ వివాదంలో విపక్షాల ఆందోళనతో రగడ మొదలైంది. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. లలిత్ గేట్ వివాదంపై చర్చ జరగాల్సిందేనంటూ పట్టుబట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు వచ్చారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న సుమిత్ర మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.