రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. దీనిపై వచ్చే వారంలో స్పష్టత రానుంది. ఉపాధ్యాయ నియామక నిబంధనలు, నియామకాలు కొత్త జిల్లాల వారీగా చేపట్టాలా, పాత జిల్లాల వారీగానా అన్న అంశాలపై ఈనెల 17న జరిగే సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.