దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచాపై విధించిన నిషేధం శివకాశిపై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. బాణసంచా విక్రయాల్లో దేశంలోనే అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఢిల్లీలో నిషేధం అమల్లోకి రావడంతో శివకాశి బాణసంచా తయారీదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ. 1000 కోట్ల విలువైన సుమారు 50 లక్షల కేజీల బాణసంచా సామగ్రిని గోదాములకే పరిమితం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.