హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గ్రిల్స్ తొలగించి బ్యాంక్‌లోకి చొరబడిన దుండగులు బంగారు ఆభరణాలు, నగదు అపహరించుకు వెళ్లారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన సిబ్బంది షట్టర్ తాళాలు పగులగొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.