ప్రధాని మోదీ ‍తదుపరి టార్గెట్స్‌ ఇవే.. | Rinsing the target of corruption! | Sakshi
Sakshi News home page

Dec 15 2016 7:50 AM | Updated on Mar 20 2024 5:03 PM

నల్లధనం, అవినీతి నుంచి వ్యవస్థను ప్రక్షాళన చేయడం ప్రస్తుతం తన ఎజెండాలో ఉన్న అత్యంత ప్రాధాన్య అంశమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధి అవకాశాల రూపకల్పన కూడా తన ప్రధాన ఎజెండాలో ఉన్నాయన్నారు. 21వ శతాబ్ది ఆసియా దేశాలదేనని తేల్చిచెప్పారు. ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతుండగా.. ఆసియా దేశాలు మాత్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని చూపాయని గుర్తు చేశారు. ‘ఎకనమిక్‌ టైమ్స్‌ ఆసియన్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాంక్లేవ్‌’లో బుధవారం మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్‌తో కలిసి మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రెండున్నరేళ్ల ఎన్డీయే పాలనలో తీసుకున్న ప్రతిష్టాత్మక నిర్ణయాలు, పథకాలను వివరించారు. ‘భారత్‌లో ప్రస్తుతం ఆర్థిక పరిణామ దశ కొనసాగుతోంది. డిజిటల్, నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా వెళ్తున్నాం. ఉద్యోగ, ఉపాధి కల్పన సాధించేందుకు అవసరమైన ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement