భారతీయ సైనిక బలగం తన శక్తి, సామర్థ్యాలు, సాహస ప్రవృత్తిని చేతల్లో చూపుతుందే కానీ.. మాటల్లో కాదని ప్రధాని మోదీ ఆర్మీపై ప్రశంసలు గుప్పించారు. పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆర్మీ విజయవంతంగా నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో శుక్రవారం శౌర్య స్మారక్(సాహస స్మారక స్థూపం)ను ప్రధాని ఆవిష్కరించారు. మాజీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్న సభలో ప్రసంగించారు. ‘శాంతి సమయాల్లో మనం ప్రశాంతంగా నిద్రపోవడంపై మన ఆర్మీకి సమస్యేం ఉండదు.