రేపు సమైక్య సభ యధాతధం:కొణతాల | No changes in holding Samaikya Sankharavam: konathala ramakrishna | Sakshi
Sakshi News home page

Oct 25 2013 11:47 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఢిల్లీ పీఠం కదిలేలా శంఖారావం ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ చెప్పారు. రాష్ట్ర విభజనను ఇంతమంది వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ మాత్రం నిర్దాక్షిణ్యంగా రాష్ట్రాన్ని విభజించడానికే ముందుకెళ్తోందని ఆయన అన్నారు. నవంబర్ 15న బిల్లు పంపుతామని దిగ్విజయ్ సింగ్ అంటున్నారని, అంతేతప్ప వారిలో ఏమాత్రం పునరాలోచన కనిపించట్లేదని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలూ విభజనకు సహకరిస్తున్నాయి తప్ప అడ్డుకోవట్లేదు కాబట్టి సమైక్య శంఖారావం పూరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ఆలోచనా విధానాన్ని ఢిల్లీకి వినిపించడానికే ఈ సభ నిర్వహిస్తున్నట్లు కొణతాల చెప్పారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో తమ పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపడతాయని, ఆ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం ఉండబోదని తెలిపారు. ఇక తమ పార్టీ ఇప్పటివరకు ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలేవీ రాలేదని, అలాంటిది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పాటుచేసిన సభ కాబట్టి, అన్ని ఆటంకాలు తొలగించుకుని యథావిధిగా జరుపుకొంటామన్న నమ్మకం తమకుందని పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను పార్టీ నాయకుడు తలశిల రఘురాం శుక్రవారం ఉదయం పర్యవేక్షించారు. ఇప్పటికే బ్యారికేడ్ల ఏర్పాటు లాంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. స్టేడియం బయట ఉన్న వారికి కూడా నిరాశ కలగకుండా బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నట్లు రఘురాం చెప్పారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement