వాన్పిక్ కేసులో చంచలగూడ జైల్లో ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 13 రోజులు బెయిల్ మంజూరు చేసింది. మామ రామ్ ప్రకాష్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 15 రోజులు పాటు అనుమతి ఇవ్వాలని ఆయన తన బెయిల్ పిటిషన్లో కోరారు. మద్యంతర బెయిల్ పిటిషన్ను విచారించిన కోర్టు అతనికి 13 రోజులపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆయన ఈ బెయిల్పై బయల ఉంటారు. బెయిల్ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతోమాత్రమే మాట్లాడాలని కోర్టు షరతు విధించింది.