ప్రధాని పదవిని చేపట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ వీడి భారంగా దేశ రాజధానికి బయలుదేరారు. ఆవ్ జో గుజరాత్ (గుడ్ బై గుజరాత్) అంటూ మోడీ న్యూఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీకి బయలుదేరే ముందు..గుజరాత్ సాంప్రదాయ ప్రకారం 6.25 కోట్ల ప్రజలకు ఆవ్ జో (గుడ్ బై) చెప్పదలచుకున్నాను అంటూ ఆవ్ జో గుజరాత్ అంటూ ఆహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరారు. గుజరాత్ నుంచి బయలదేరే ముందు ప్రింట్, టెలివిజన్, ఎడిటర్స్, కాలమిస్ట్ లతోపాటు మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 13 ఏళ్లపాటు మీడియా అందించిన సహకారం మరువలేనిదని మోడీ అన్నారు. అంతకుముందు తన కుటుంబ సభ్యులతో కాసేపు మోడీ గడిపారు. తన తల్లి ఆశీర్వాదం తీసుకుని దేశరాజధానికి బయలుదేరారు.