రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వ్యవస్థలను రద్దు చేయాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న మూడంచెల వ్యవస్థను కొనసాగించాలని పేర్కొంది. పంచాయతీ సర్పంచ్‌లు మండల పరిషత్ చైర్మన్‌ను, మండల పరిషత్ చైర్మన్లు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకుంటారని తెలిపింది. నగర పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. స్థానిక సంస్థల పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి పూంచీ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్రం ఈ మేరకు తన అభిప్రాయాలను కేంద్రానికి లిఖిత పూర్వకంగా తెలిపింది.