తమిళ పాలి'ట్రిక్స్‌': మళ్లీ ట్విస్ట్‌ | Sakshi
Sakshi News home page

తమిళ పాలి'ట్రిక్స్‌': మళ్లీ ట్విస్ట్‌

Published Tue, Aug 22 2017 4:14 PM

తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారిక అన్నాడీఎంకే పార్టీలో తలెత్తిన విభేదాలు ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి సంకటంగా మారాయి. పన్నీర్‌ సెల్వం వర్గం విలీనం కావడంతో అన్నాడీఎంకేలో మరోసారి సంక్షోభం నెలకొంది. శశికళ వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో పళనిస్వామి సర్కారు మైనార్టీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ చురుగ్గా పావులు కదుపుతున్నారు. మంగళవారం ఆయన గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తక్షణమే శాసనసభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని లేఖలో కోరారు. పళనిస్వామి సర్కారును ప్రజాస్వామ్యయుతంగా సాగనంపుతామని స్టాలిన్‌ ఇంతకుముందే ప్రకటించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement