అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా వారమైనా లేదు. క్లింటన్ ఈ-మెయిల్స్ వ్యవహారం మాత్రం ముదురుతూ వస్తోంది. ప్రైవేట్ ఈ-మెయిల్స్ వాడక వ్యవహారంలో ఇప్పటికే తలమునకలవుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు మరో కొత్త చిక్కు వచ్చి పడింది. అమెరికా ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఘట్టం ఫెడ్ డిబేట్లో అడగబోయే ప్రశ్నలు క్లింటన్కు ముందే తెలిశాయని వికిలీక్స్ పేర్కొంది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ చైర్పర్సన్, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డోనా బ్రజిలే ఫెడ్ డిబేట్ ప్రశ్నలను క్లింటన్కు ముందే అందిచారని వికీలీక్స్ తెలిపింది. వికీలీక్స్ పబ్లిష్ చేసిన క్లింటన్ ఈ-మెయిల్స్ బట్టి ఇది స్పష్టమైందని రిపోర్టు చేసింది. దీంతో ఫెడ్ డిబేట్ను నిర్వహించిన సీఎన్ఎన్ సంస్థ, డోనా బ్రజిలేతో పూర్తిగా తెగదెంపులకు సిద్దమైంది. న్యూస్ న్యూస్ నెట్వర్క్లో ఆమె చాలాకాలంగా కంట్రిబ్యూటర్గా నిర్వహిస్తూ వస్తున్నారు. అక్టోబర్ 14న బ్రజిలే సమర్పించిన రాజీనామాను సీఎన్ఎన్ అంగీకరించిందని ఆ నెట్వర్క్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
Nov 2 2016 7:15 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
Advertisement
