మధ్యప్రదేశ్ హోటల్లో సంభవించిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. తాజాగా జాతీయ వార్తాఛానళ్లు చెబుతున్న వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో 82 మందిమరణించారు. ఇంకా చాలామంది గాయపడినట్లు తెలుస్తోంది. జబువా జిల్లా కేంద్రంలోని ఒక రెస్టారెంటులో గ్యాస్ సిలిండర్ లీకై.. పేలిపోవడంతో పైన ఉన్న రెండు అంతస్థులు కుప్పకూలాయి. పేలుడు కంటే, భవన శిథిలాల కింద చిక్కుకుపోయి మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లోని వంటగదిలో పేలుడు జరగటంతో... మొదటి, రెండో అంతస్తు కూలిపోయింది.