మధ్యప్రదేశ్లోని ఓ టోల్ ప్లాజా వద్ద నానా భీభత్సం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆ ఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పనుగాక చెప్పను అని చెప్పారు. పైగా ఆయన దాడి చేసిన వ్యక్తులపైనే తిరిగి కేసు పెట్టారు. సోమవారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యే కాలు సింగ్ ఠాకూర్ను భోపాల్లోని ఓ టోల్ ప్లాజా వద్ద టోల్ నిర్వహకులు ఆపారు. టోల్ చెల్లించాలని అడిగారు.