వైఎస్సార్ సీపీ ఆశయసాధనకు కృషి చేస్తానని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. రాజకీయంగా వెనుకబడిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినప్పటికీ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ వీరభద్ర స్వామి కృతజ్ఞతలు తెలియజేశారు. వైఎస్ జగన్ ది ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వమన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ వదులుకున్నప్పటికీ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం కోలగట్ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్ర స్వామి పేర్లను వైఎస్సార్ సీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Mar 13 2015 4:25 PM | Updated on Mar 21 2024 7:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement