సంక్రాంతి పండుగ మూడు రోజులు జిల్లాలో కోడిపందేలు, పేకాట, గుండాట భారీ స్థాయిలో సాగాయి. సంప్రదాయం ముసుగున పెద్ద ఎత్తున జూదానికి తెరలేపారు. కోడిపందేల బరుల వద్ద పేకాట యథేచ్ఛగా సాగింది. రాత్రిళ్లు సైతం ఫ్లడ్ లైట్ల వెలుతురులో పేకాట, కోడిపందేలను నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే జిల్లాలో అత్యధికంగా కోడిపందేల బరులు కొనసాగాయి.