ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో కాంగ్రెస్ పార్టీకి తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గిన మాట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగైదు జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనపడినమాట నిజమేనని, చిత్తూరు జిల్లా ఫలితాలను పార్టీపరంగా చర్చించాల్సిన అవసరముందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తనకొచ్చిన సీట్ల సంఖ్యను తారుమారు చేస్తోందని, ఆ పార్టీ వాపు చూసి బలుపనుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.