తెలంగాణ ప్రాజెక్టులను తన అధీనంలోకి తెచ్చుకునేందుకు గోదావరి బోర్డు చేస్తు న్న ప్రయత్నాలను గట్టిగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై కేంద్రా నికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. బుధవారం ఢిల్లీ వెళ్లనున్న నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్ రావు కేంద్ర జల వనరులశాఖ మంత్రి ఉమాభారతి ని కలసి బోర్డు విడుదల చేసిన ముసాయిదా నోటిఫికేషన్‌ను ఆమె దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు న్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గిన గోదావరి బోర్డు... శ్రీరాంసాగర్, నిజాం సాగర్, సింగూరు, లోయర్ మానేరు, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తమ పరిధిలోకి తీసుకుంటామంటూ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడం తెలి సిందే. ముసాయిదా అమల్లోకి వస్తే ప్రాజెక్టుల బ్యా రేజీ హెడ్‌వర్క్స్, డ్యామ్‌లు, రిజర్వా యర్లు, కాల్వ లు, రెగ్యులేటర్లతోపాటు విద్యుత్ పాంట్ల హెడ్ వర్క్‌లు, రిజర్వాయర్ల పరిధిలోని ఎత్తిపోతల పథకాలు, నీటిని విడుదల చేసే ఇతర నిర్మాణాలన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి.