భారత నౌకా దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఫ్రెంచ్ డిఫెన్స్ కాంట్రాక్టర్ డీసీఎన్ఎస్ కంపెనీ ద్వారా భారత్ నావికా దళం కోసం ఆరు స్కార్పియన్ క్లాస్ జలాంతర్గాములను తయారు చేస్తుండగా వాటికి సంబంధించిన రహస్య సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. దాదాపు 22,400 పేజీల సమాచారం అక్రమంగా వెల్లడైందని 'ది ఆస్ట్రేలియన్' అనే ఓ ఆస్ట్రేలియా పత్రిక వెల్లడించింది. ఈ లీక్ కారణంగా ఈ జలాంతర్గాములు పనిచేసే సామర్థ్యం, పనితీరుకు సంబంధించిన పూర్తి రహస్యాలు వెలుగులోకి వచ్చినట్లు ఆ పత్రిక పేర్కొంది.