ఎందరు వారిస్తున్నా పట్టుబట్టి కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దానికి నాటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనే నిదర్శనమని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. విద్యార్థుల త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని అన్న జేఏసీ చైర్మన్ కోదండరాం కనీసం కేసీఆర్ పేరును కూడా ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్ తయారు చేసిన వేలాది మందిలో కోదండరాం ఒకరని, ఆయనను జేఏసీ చైర్మన్‌ను చేసిందే కేసీఆర్ అని సుమన్ అన్నారు.