తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేసేలా ఆదేశించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. జయలలిత ఆరోగ్యంపై వైద్యులు వెంటనే వైద్య నివేదికను విడుదల చేయాలని ఆదేశించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఆరోగ్య విషయంలో ఆందోళన మొదలైనప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేయడం ఆస్పత్రి బాధ్యత అంటూ అపోలో ఆస్పత్రి వైద్యులకు ఆదేశించింది.