పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు, అధికారులతో జరిపిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ మూడు వారాలు గడిచినా ఇప్పటికీ ఏటీఎంలు, బ్యాంకుల ముందు నిలబడి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతునే ఉన్నారన్నారు. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ఉదయం, సాయంత్రం సమీక్షిస్తున్నా బ్యాంకర్ల సహాయ నిరాకరణ, వైఫల్యం వల్ల ప్రజల దృష్టిలో నిస్సహాయులుగా మిగిలిపోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.