రైతులకు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు సర్కారు క్రమేపీ దిగివస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీపై ఇప్పటి వరకూ నాన్చవేత ధోరణి అవలంభిస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా ఆర్బీఐకీ సమాధాన పత్రం పంపింది. ఈ మేరకు గురువారం ఓ లేఖను ఆర్బీఐకి అందజేసింది. వ్యవసాయ, బంగారు రుణాలను కూడా ఏడేళ్లు పాటు రుణాలను రీ షెడ్యూల్ చేయాలని ఆ లేఖలో పేర్కొంది. తక్షణమే కొత్త రుణాలను మంజారు చేయాలని ఆర్బీఐకి విన్నవించింది. లక్షన్నర వరకూ రుణమాఫీ చేస్తామని ఆర్బీఐకి హామీ ఇచ్చింది. రీషెడ్యూల్ ప్రతిపాదనపై వివరాలు కోరుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బుధవారం లేఖ రాసింది. రైతుల రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్‌బిఐ అంగీకరించినట్లయితే.. మాఫీ చేసిన రుణాలను మూడేళ్లలో చెల్లించగలరా? అని రెండు ప్రభుత్వాలను ఆర్‌బిఐ ప్రశ్నించింది. రుణాల రీషెడ్యూల్ విధి విధానాలపై నివేదిక పంపాలని రెండు ప్రభుత్వాలను కోరింది. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికార చేజిక్కించుకున్న చంద్రబాబు రుణాలు మాఫీ చేయలేక, కనీసం రీషెడ్యూల్ అన్నా చేయించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితులలో అనేక నిబంధనలతో ఆర్బిఐ ఓ లేఖను ఏపీ ప్రభుత్వానికి పంపింది. ఇందుకు ప్రతిగా చంద్రబాబు సర్కారు లేఖను ఆర్బీఐకి అందజేసింది.
Jul 17 2014 4:32 PM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
Advertisement
