ప్రభుత్వ పర్యాటక ప్రచార కార్యక్రమం ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ సేవల నుంచి తనను కొన సాగించరాదన్న నిర్ణయాన్ని గౌరవిస్తానని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చెప్పారు. దీనిపై ఆయన గురువారం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పదేళ్ల పాటు ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా దేశానికి సేవ చేయడంలో సంతోషం ఉంది. సేవ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఈ సందర్భంగా నేనొక స్పష్టత ఇవ్వదలచుకున్నాను.