తాళ్లపాక శ్రీ సిద్దేశ్వరాలయంలో
ధ్వజావరోహణం చేస్తున్న అర్చకులు
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నానం చేస్తున్న అర్చకులు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్‌థస్థలిలో శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాల్లో తిరుపతి తిరుమల దేవస్థానం చేపట్టిన వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ధ్వజావరోహణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. కాగా సోమవారం పుష్పయాగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వరాలయంలో త్రిశూలస్నానం, శ్రీదేవి, భూదేవిలతో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక బ్రహ్మోత్సవాలకు వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో తాళ్లపాక ఆలయాల ఇన్‌స్పెక్టర్ బాలాజీ, అన్నమయ్య శ్రీవారి ఆలయం ఇన్‌స్పెక్టర్ వినోద్, అర్చకులు సుదర్శన్, శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నరేష్, మాజీ సర్పంచ్ శ్యామనబోయిన గౌరీ శంకర్, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


