చిత్రంలో కనిపిస్తున్నది బ్రిటిష్ కాలం నాటి నందలూరు ఫస్ట్‌క్లాస్ మున్సిఫ్‌కోర్టుకు చెందిన చారిత్రక న్యాయపీఠం. నాణ్యమైన టేకు చెక్కతో తయారైన ఈ కుర్చీపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక చిహ్నమైన ‘విక్టోరియా మహారాణి కిరీటం‘ గుర్తు నేటికీ స్పష్టంగా ఉంది. నాడు ఉమ్మడి జిల్లాలోని దాదాపు 30 మండలాల ప్రజలకు న్యాయం అందించిన ఈ పీఠంపై తెల్లదొరలతో పాటు, దేశ విభజన క్రమంలో పాకిస్తాన్‌కు తరలివెళ్ళిన ఒక ప్రముఖ న్యాయమూర్తి కూడా కూర్చుని కీలక తీర్పులు ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో కక్షిదారులు గూడుబండ్లు కట్టుకుని, ముందు రోజే వచ్చి కోర్టు షెడ్ల కింద రాత్రిళ్ళు బస చేసేవారు. 2003లో ఈ కోర్టు శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. 2000 లో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో నాగిరెడ్డిపల్లె మసీదు కమిటి మాజీ అధ్యక్షులు షౌకత్‌అలీ లోడి ఈ కుర్చీని దక్కించుకోగా, అది నేటికీ ఆయన వద్దే భద్రంగా ఉంది. – రాజంపేట


