నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లోక్ అదాలత్ సభ్యుడైన ఫైజుల్లాఖాన్ లోడి పాత రికార్డులను పదిలంగా దాచి భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడతాయో నిరూపించారు. చరిత్రను, పాత జ్ఞాపకాలను ప్రేమించే ఆయన నాటి తరం రికార్డులను భద్రపరిచి అందరి చేత ‘భేష్’ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ కార్యక్రమం కింద ప్రస్తుతం ఉన్న ఓట్లను 2002 నాటి పాత రికార్డులతో ‘మ్యాపింగ్’ చేయాల్సి వచ్చింది. దీంతో పాత ఓటర్ల జాబితా కోసం జిల్లావ్యాప్తంగా జనం ఆఫీసుల చుట్టూ తిరిగినా రికార్డుల జాడ దొరకక అల్లాడిపోయారు. ఈ తరుణంలో ఫైజుల్లాఖాన్ లోడి జనానికి ఆపద్బాంధవుడిగా మారారు. ఆయన 2002 నాటి జాబితానే కాకుండా, ఏకంగా 1959 నాటి ఓటర్ల జాబితాను భద్రంగా దాచారు. తాత ముత్తాతల వివరాలున్న ఈ లిస్టు ఇప్పుడు ఓట్ల మ్యాపింగ్‌కు అమూల్యమైన నిధిలా ఉపయోగపడుతోంది. – రాజంపేట


