కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడం జెన్ – జీ యు వ విజయమని, చరిత్రలో నిలిచిచిపోయే చారిత్మక ఘ ట్టం ఈ పోరాటం ,ఈ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు అని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో ఢిల్లీలో విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ అందోళన చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పట్టుదలతో,మొక్కవోని దీక్షతో పోరాడిన ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రదాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని, ఇది విద్య మాఫియాపై యువతరం సాధించిన విజయంగా పేర్కొన్నారు.. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరమని, వెంటనే వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. అక్రమ కేసులు ఎత్తివేసే వరకు పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. నీట్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న 22 మంది విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు నాయకులు ఏం. వి సుబ్బారెడ్డి, కె.సీ బాదుల్లా, జీ.వేణుగోపాల్,జీ.ఓబులేసు, ఎన్.విజయలక్ష్మి,, మద్దిలేటి, మునేయ్య ,సావంత్ సుధాకర్,అరుణ్,రామ్మోహన్ రెడ్డి,లింగన్న ,నారాయణ ,పకీరప్ప, సుబ్బారాయుడు ,చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.


