బహుళ పంటల సాగు లాభదాయకం | - | Sakshi
Sakshi News home page

బహుళ పంటల సాగు లాభదాయకం

Jul 27 2026 1:24 AM | Updated on Jul 27 2026 1:24 AM

కడప అగ్రికల్చర్‌: రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా బహుళ పంటలసాగు చేపట్టడం ద్వారా లాభాలు పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో ఆదివారం రైతు మాస్టర్‌ ట్రైనర్లకు డీ బ్రీఫింగ్‌ సమావేశం జరిగింది. ముందుగా జూమ్‌ వీడియో కాన్పరెన్స్‌ ద్వారా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైఎస్‌ చైర్మెన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎల్‌నిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి రైతు తప్పని సరిగా ఫ్రీ మాన్సూన్‌ డ్రై సోయింగ్‌ చే పట్టాలని సూచించారు.హై రిస్క్‌ మోడరేట్‌ రిస్క్‌ ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాల ని సూచించారు. అనంతరం జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యవసాయ సిబ్బంది ప్రతి రైతును చైతన్య పరిచి ఈ ఎల్‌నినో పరిస్థితుల్లో వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో రైతు మాస్టర్‌ ట్రైనర్లు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయ

జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌

ప్రవీణ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement