రిమ్స్‌కు అత్యాధునిక డిజిటల్‌ రేడియోగ్రఫీ సిస్టమ్‌ | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌కు అత్యాధునిక డిజిటల్‌ రేడియోగ్రఫీ సిస్టమ్‌

Jul 21 2026 12:23 AM | Updated on Jul 21 2026 12:23 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: కడప ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి మరో అత్యాధునిక వైద్య పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ 1000 ఎంఎ డ్యూయల్‌ డిటెక్టర్‌ డిజిటల్‌ రేడియో గ్రాఫిక్‌ సిస్టమ్‌ ద్వారా రోగులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్‌ఐసీ సంస్థ తన గోల్డెన్‌ జూబ్లీ ఫండ్‌ (జీజేఎఫ్‌) కార్యకలాపాల్లో భాగంగా రూ. 2 కోట్ల 21 లక్షలు వెచ్చించి రిమ్స్‌కు ఈ పరికరాన్ని అందజేసింది. ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌, హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ శరవణ రమేష్‌ ఈ పరికరాన్ని అందజేసి ప్రారంభించారు. ఎల్‌ఐసీ రీజినల్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎఓ జీకేఆర్‌వీ రవికుమార్‌ రేడియోగ్రాఫిక్‌ సిస్టమ్‌ స్విచ్‌ ఆన్‌ చేశారు. ఎమ్మేల్యే మాధవి గౌరవ అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో కడప ఎల్‌ఐసీ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ ఎంవీకెఎస్‌ దుర్గా ప్రసాద్‌, అడ్మినిస్ట్రేటర్‌ యు.రంగస్వామి, రిమ్స్‌ సూపరింటెండెంట్‌ పెంచలయ్య, ఆర్‌ఎంవో శ్రీనివాసులు, రేడియోలజీ విభాగం హెచ్‌.వో.డి. శారద తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement