● ఐదుగురికి గాయాలు
ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా మరొకరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కడపకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు సమీపించగానే ముందువైపు గొర్రెలు రావడంతో బస్సును స్లో చేసాడు.ఇంతలో బస్సుకు వెనుకవైపు వస్తున్న లారీ బస్సును ఢీకొంది.దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతింది.బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులున్నారు.ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సచేయించుకుని వెళ్లిపోయారు.కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు.లారీ డ్రైవరుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ తాడిపత్రి నుంచి ఎర్రగుంట్లకు ప్రయాణిస్తున్నట్లు,లారీ డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.
వేముల : మండలంలోని చింతజూటూరులో ఆదివారం తెల్లవారుజామున కుక్కలు దాడి చేయడంతో 38 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన సత్యం, రామిరెడ్డి గంగిరెడ్డి, గంగులయ్య గ్రామ సమీపంలోని కలంలో గొర్రెలను వదిలారు. తెల్లవారుజామున గుంపుగా వచ్చిన కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దాడిలో 38 గొర్రెలు మృతి చెందడంతో సూమారు రూ.5 లక్షలు నష్టం వచ్చినట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న వైఎస్సాఆర్ సీపీ మండల ఇన్‌చార్జ్ నాగేళ్ల సాంబశివారెడ్డి గ్రామానికి చెరుకుని బాధితులను పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో చలమారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు.


