బాటనీ పరీక్ష ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

బాటనీ పరీక్ష ప్రశాంతం

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

బాటనీ పరీక్ష ప్రశాంతం ప్యాసింజర్‌, డెమో రైళ్ల రద్దు 26న కడప ఐటీఐలో జాబ్‌ మేళా రామయ్యకు స్నపన తిరుమంజనం నేడు విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు రైతులకు దిక్సూచి ‘రైతు వాణి’

కడప ఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శనివారం బాటనీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ప్రథమ సంవత్సరానికి సంబంధించి 491 మందికి 438 మంది హాజరయ్యారు. సెకండియర్‌కు సంబంధించి 808 మందికిగాను 749 మంది హాజరయ్యారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌: తిరుపతి–హుబ్లి–తిరుపతి, అర్కోణం–కడప–అర్కోణం మధ్య నడు స్తున్న డెమో, ప్యాసింజర్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దుచేసినట్లు కడప రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి–హుబ్లీ (57401) ఈనెల 23, 24, 30, 31 తేదీలలో, హుబ్లి–తిరుపతి (57402) 24, 25, 30, 31 తేదీలలో, అర్కోణం–కడప (66001) 23, 24, 30, 31, కడప–అర్కోణం (66006) 23, 24, 31 తేదీలలో రద్దు చేశా రన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేశారన్నారు. ప్రయాణికులు ఈ విష యాన్ని గమనించి ఆయా రోజుల్లో ప్రత్యామ్నా య మార్గాలను చూసుకోవాలని ఆయన కోరారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రముఖ అంతర్జాతీయ చాక్లెట్‌ తయారీ సంస్థ ’మాండలేజ్‌’ (కాడ్‌బరీ–శ్రీసిటీ) లో ఉద్యోగాల భర్తీకి ఈ నెల 26న కడపలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ జ్ఞానకుమార్‌ తెలిపారు. ఐటీఐ (2 ఇయర్స్‌ కోర్సు) పాసైన పురుషులు మాత్రమే అర్హులని, వయస్సు 18 నుండి 22 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఐటీఐలో కనీసం 50% మార్కులు ఉండాలని, వేతనం నెలకు రూ. 19,500 తో పాటు ఇతర అలవెన్సులుంటాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 26న ఉదయం 9:30 గంటలకు కడప ఐటీఐ సర్కిల్‌ వద్ద ఉన్న ప్రభుత్వ డీఎల్‌టీసీ ఐటీఐ ప్రాంగణానికి తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, రెజ్యుమెతో ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్‌లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు, శ్రావణ్‌ కుమార్‌ మూల విరాట్‌కి పంచామృతాభిషేకం నిర్వహించారు. టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్‌కి సమర్పించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.

సాక్షి, మదనపల్లె: స్థానిక డిస్కం డివిజన్‌ కార్యాలయంలో ఆదివారం వినియోగదారులు విద్యుత్‌ బిల్లులను చెల్లించవచ్చని గంగాధరం శనివారం తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్‌ కార్యాలయ కౌంటర్లలో సిబ్బంది విధుల్లో ఉంటారని బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.

కడప అగ్రికల్చర్‌: పంటల సాగులో రైతువాణి పుస్తకం దిక్సూచి వంటిదని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు అన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన రైతు వాణి పుస్తకాన్ని శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు, మార్కెటింగ్‌ సౌకర్యం, ఎరువులు విత్తనాలు పురుగుమందులు అన్ని రకాల పంటలకు సంబంధించిన వ్యాసాలు ఈ పుస్తకంలో ఉన్నాయయన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య బి. దస్తగిరి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement