పులివెందుల టౌన్ : పులివెందుల ప్రాంత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజారెడ్డి అని మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో దివంగత నేత, వైఎస్సార్ తండ్రి వైఎస్ రాజారెడ్డి వర్దంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్పలతో కలిసి వైఎస్ రాజారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పెద్దాయన వైఎస్ రాజారెడ్డి పేదలకు, తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారికి అండగా నిలిచేవారన్నారు. వైఎస్ రాజారెడ్డి చిరస్మరణీయుడు అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లి కిశోర్, నూర్ బాషా సంఘ రాష్ట్ర నాయకులు రసూల్, రాష్ట్ర బూత్ కమిటీ సభ్యులు చంద్రమౌళి, మాజీ కో.ఆప్షన్ చంద్రమౌళి, నాయకులు సోపాల వీరా, యార్వ వెంకటసుబ్బయ్య, పద్మనాభ రెడ్డి, వీరారెడ్డి, సంపత్, రవి, మస్తాన్, కనక, కోళ్ల భాస్కర్, కృష్ణమూర్తి, ఫైర్ రామకృష్ణ, తోటం శెట్టి హరి, బీసీ నాయకులు కార్తీక్, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భూమన కరుణాకర్‌రెడ్డి నివాళి
పులివెందుల రూరల్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పట్టణంలోని స్థానిక డిగ్రీ కళాశాల రోడ్డులో ఉన్న వైఎస్సార్ సమాధుల తోటలోని వైఎస్ రాజారెడ్డి సమాధి వద్ద టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే అక్కడే ఉన్న ఇతర వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద కూడా ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజారెడ్డి బాటలో తాను మొదటి నుంచి నడిచానన్నారు. దివంగత వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి కావడంలో వైఎస్ రాజారెడ్డి పాత్ర ఎంతో ఉందన్నారు.


