వేంపల్లె/పులివెందుల: కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గురువారం ఆయన వేంపల్లెలో టీడీపీ నాయకులు పెట్టిన కేసులో విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం పులివెందులలోని స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీన మంజుల భాస్కర్ సాయినాథ్ అనే ఫిర్యాదుదారుడు అంబటి రాంబాబుపై కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసు విషయంలో ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కేసు విచారణ నిమిత్తం పులివెందుల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సుమారు 2గంటలపాటు ఆయనను పలు ప్రశ్నలు వేయగా సమాధానాలు చెప్పారు. వేంపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఆయనను 2గంటల పాటు పోలీసులు విచారణ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు నేను భయపడనని, అక్రమంగా బనాయించిన కేసులను న్యాయస్థానంలో ఎదుర్కొంటానన్నారు. రాష్ట్రంలో పోలీసులు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కేసులు పెడితే న్యాయస్థానంలో ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగుతామన్నా రు. ఇప్పటికై నా చంద్రబాబు, లోకేష్‌లు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. అలాకాకుండా అక్రమ కేసులు, జైళ్లకు పంపితే ప్రజాస్వామ్య పద్ధతిలో సర్వనాశనమవుతారన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు కూడా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారన్నారు. అలాంటి ప్రతి పోలీసు ఆఫీసర్‌ను కూడా న్యాయస్థానం ముందు నిలబెడతామన్నారు. వేంపల్లె పోలీస్ స్టేషన్‌లో 25/26లో టీడీపీకి చెందిన రామమునిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిజిస్టర్ చేసిన కేసులో పోలీసు విచారణకు రమ్మనగా గుంటూరు నుంచి విచారణకు వచ్చానని ఈ సందర్భంగా తెలియజేశారు. 2 గంటలపాటు వేంపల్లె పోలీసులు విచారణ చేశారన్నారు. జనవరి 31వ తేదీవరకు గుంటూరులోని గోరంట్లలో చంద్రబాబును దూషించానని కేసు పెట్టడం జరిగిందన్నారు. అప్పుడే అల్లపాటి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారని తెలిపారు. 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించానని అన్నారు. ఒకే విషయంలో 32 కేసులు నమోదు చేశారన్నారు. న్యాయస్థానాల తీర్పు ప్రకారం మల్టిపుల్ కేసులు పెట్టడం చట్టరీత్యా నేరమని ఆన్నారు. మళ్లీ కూడా రెండు వేంపల్లె, పులివెందులలో కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకుంటున్నారని విమర్శించారు.. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్.వేణుగోపాల్, వైఎస్సార్‌సీపీ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, భారతి, సల్మా, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోషియల్ మీడియాలో జగన్‌మోహన్‌రెడ్డిని ఎంతోమంది తిడుతు న్నారని, ఒక్కరిపైన అయినా కేసు పెట్టారా , చట్టం చంద్రబాబునాయుడికి ఒకటి, జగన్‌మోహన్‌రెడ్డికి ఒకటి ఉందా అని అన్నారు. అంతకుముందు పులివెందులలోని చందమామ డాబా వద్దకు చేరుకున్న అంబటి రాంబాబును వైఎస్సార్‌సీపీ నాయకులు, బలిజ సంఘం నాయకులు కలిసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కడప రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ వారిద్దరూ కాసేపు ముచ్చటించారు.
కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడను
మాజీ మంత్రి అంబటి రాంబాబు


