జూన్‌లో కొత్త టెర్మినల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

జూన్‌లో కొత్త టెర్మినల్‌ ప్రారంభం

May 1 2026 5:45 AM | Updated on May 1 2026 5:45 AM

జూన్‌లో కొత్త టెర్మినల్‌ ప్రారంభం

కడప సెవెన్‌రోడ్స్‌: జిల్లా ప్రజలకు త్వరలో అధునాతన విమానయాన సర్వీసులు చేరువ కానున్నాయని కలెక్టర్‌ డాక్టర్‌శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు.గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలులో నిర్వహించిన ఎయిరోడ్రోమ్‌ కమిటీ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. కడప ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, జూన్‌లో కొత్త డొమెస్టిక్‌ టెర్మినల్‌ భవనాన్ని నిర్వహణలోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. నూతన టెర్మినల్‌ను ప్రారంభించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్‌ భద్రతకు సంబంధించి, రాష్ట్ర పోలీస్‌ విభాగం పరిమితి భద్రతను బలోపేతం చేయాలని, పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తుల నేపథ్యాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు రోజువారీ, చైన్నె మరియు విజయవాడకు ప్రత్యామ్నాయ రోజుల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయని, కొత్త టెర్మినల్‌ ప్రారంభం తర్వాత మరిన్ని విమాన మార్గాలను ప్రారంభించేందుకు ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఎయిర్‌ పోర్ట్‌ పరిసరాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉంచడంలో కడప మున్సిపల్‌ కమిషనర్‌, పంచాయతీ రాజ్‌ శాఖలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

మే 22 నుంచి రైతు పండుగ

రైతులకు సాంకేతికత, పంట దిగుబడి మార్కెట్‌కు అనుసంధానం చేసే అంశాలపై అవగాహన కల్పించేందుకు మే 22 నుంచి 24వ తేది వరకు జిల్లాలో నిర్వహించే రైతు పండుగ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలని కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్దకశాఖ, పట్టు పరిశ్రమల, మత్స్యశాఖ అధికారులు స్టాల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. నాబార్డు, ఇతర బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందే సౌకర్యం, పంటలు మార్కెటింగ్‌ చేసే అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని ఆదేశించారు.

● జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్‌స్మార్ట్‌ కిచెన్‌ షెడ్స్‌ నిర్మాణ పనులను పాఠశాలల పునః ప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకు రావాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పారిశ్రామికరంగ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్ట్స్‌ కళాశాల సమీపంలోని పీ4 స్టార్టప్‌ కడప ఎంట్రర్‌ప్రెన్యూర్‌షిప్‌ సెంటర్‌ నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు.

ఈవీఎం గోడౌన్ల పరిశీలన

కలెక్టర్‌ శ్రీధర్‌ గురువారం ఈవీఎం గోడౌన్లను పరిశీలించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు నెల వారి తనిఖీల్లో భాగంగా గోడౌన్లను తనిఖీ చేశారు.

ఎయిరోడ్రోమ్‌ కమిటీ

సమావేశంలో కలెక్టర్‌ శ్రీధర్‌

Advertisement
 
Advertisement
Advertisement