కడప కార్పొరేషన్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(వైఎస్సార్‌టీయూసీ) కార్మికుల పక్షపాతిగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎంపాటు సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్‌లు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్సార్‌టీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్‌చేసి ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం అంజద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్‌టీయూసీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తయ్యిందని, అప్పటినుంచి కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయలేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే వారిని గుర్తించి ఏడాదికి రూ.10వేలు ఇచ్చినట్లు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేసిందని, ఆ పథకాలన్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలు కావడం లేదన్నారు. ఇందు కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు.
వైఎస్సార్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. జాషువా మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్‌టీయూసీ వారి వెన్నంటి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రిమ్స్‌లో 114 మంది కార్మికులను తొలగించారని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకూ వైఎస్సార్‌టీయూసీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌టీయూసీ ఏర్పడినప్పటి నుంచి సుమారు 9 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ కార్మికుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సింగమాల వెంకటేశ్వర్లు, డా. నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, సీహెచ్ వినోద్ కుమార్, రాయల్ బాబు, రామ్మోహన్‌రెడ్డి, ఐస్‌క్రీం రవి, తోటక్రిష్ణ, త్యాగరాజు, బాలస్వామిరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, షంషీర్, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, మియ్యా, కంచుపాటి బాబు, రహీమ్, మల్లీశ్వరి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా


