కడప అర్బన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్‌లో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో వివిధ కళాశాలల విద్యార్థులకు 38 హెల్మెట్లను జిల్లా ప్రధానన్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి డ్రైవ్ చేయకూడదన్నారు. డ్రైవింగ్ లైసెనన్స్ లేకుండా వాహనాలను నడుపరాదన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.దీనబాబు,ఆరో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.రమేష్‌కుమార్, పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి టి.కేశవ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.సి ఆషిఫాసుల్తానా, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫకృద్దీన్ విచ్చేశారు. రోడ్డు ప్రమాదాలపై న్యాయ విజ్ఞాన సదస్సును బసవ రామ తారక లా కాలేజీ, బసిరెడ్డి లా కాలేజీ, ఎస్వీ, కెఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలు, వివేకానంద మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నిర్వహించారు.
జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని


