జమ్మలమడుగు రూరల్ : పర్యాటక ప్రాంతమైన గండికోటలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గండికోటకు చెందిన పొలం గల రైతు శుక్రవారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి గండికోటలో పురాతన మసీద్ పక్కన పొలంలో తవ్వకాలు చేపట్టారు. గతంలో కూడా పలు మార్లు తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. స్థానిక ప్రజల సహకారం లేనిదే ఈ వ్యవహారం జరగదని పలువురు అంటున్నారు.
చామలూరు గ్రామంలో..
కొండాపురం : మండలంలోని చామలూరు గ్రామానికి చెందిన జి.రామాంజనేయులరెడ్డి పొలంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు చేపట్టిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది. శుక్రవారం ఉదయం తన పొలంలోకి రైతు వెళ్లి చూడగా పుట్ట వద్ద జేసీబీతో సుమారు పది అడుగుల లోతు తవ్వినట్లు తెలిపారు. బొలేరో క్యాంపర్ జాడలు ఉన్నట్లు పేర్కొన్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ అచ్చింతలు ఉన్నాయని పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమచారం ఇచ్చినట్లు వివరించారు.
కొండాపురం మండలం చామలూరు పొలంలో తవ్విన గుంత
గండికోట వద్ద పొలంలో
తవ్వకాలు జరిగిన ప్రదేశం


