రాజంపేట : పెన్షనర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజీ సూచించారు. రాజంపేటలోని ఆయన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారికి సూచనలు, సలహాలు అందజేశారు. పని చేసి రిటైర్డ్ అయిన తర్వాతే ఉత్సాహంగా, ఆరోగ్యంగా మరింతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి రోజు వాకింగ్ చేయాలని చెప్పారు. రిటైర్డ్ అయిన తర్వాత మిగిలిన జీవిత కాలాన్ని ప్రశాంతంగా కొనసాగేలా వ్యవహరించాలన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ రాజంపేట తాలుకా ప్రెసిడెంట్ పిల్లి పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంక్ మాజీ మేనేజరు పిల్లి పిచ్చయ్య, డీసీసీ మాజీ జనరల్ మేనేజరు గాలిశెట్టి మనోహర్ నేతృత్వంలో శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్లు భాస్కర్ పంతులు, వెంకటేశ్వరి, జయమ్మ, రామానాయుడు, డి.బాబు, కె.నరసయ్య, ఎ.సుబ్రమణ్యం, పిల్లి నరసింహులు, పాల రాజగోపాల్, ఎంవీ రమణ, రాజేశ్వరరావు, బొడ్డు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


