ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల, చిలంకూరు గ్రామాల్లో డాబాలు, హోటళ్లలో విజిలెన్స్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలోగురువారం దాడులు నిర్వహించారు. 13 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఉన్నతాధికారులుకు నివేదిక అందిస్తామన్నారు.ఆర్‌ఐ ప్రమీల, అధికారులు భాస్కర్‌రెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు.
హోటళ్లపై ఎన్‌పోర్సుమెంట్ అధికారుల దాడులు
జమ్మలమడుగు: పట్టణంలోని హోటళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగోవిందు మోరె ఆధ్వర్యంలో అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పాతబస్టాండ్ తాడిపత్రి రహదారిలో ఉన్న ఓ బేకరిలో దాడులు చేశారు. అక్రమ సిలిండర్లు కలిగి ఉండటంతో ఏడింటిని సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. బేకరి యాజమాన్యంపై కేసునమోదు చేసినట్లు డీటీ తెలిపారు.
బి.కోడూరు : మండలపరిధిలోని వివిధ హోటళ్లలో గృహావసరాలకు వినియోగించే 5 సిలిండర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు ఆర్డీఓ ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహావసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.


