శ్రీరామనవమి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

శ్రీరామనవమి శుభాకాంక్షలు

Mar 27 2026 8:54 AM | Updated on Mar 27 2026 8:54 AM

శ్రీరామనవమి శుభాకాంక్షలు 28న జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య

పులివెందుల: వైఎస్సార్‌ జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని జిల్లా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని .. జిల్లా ప్రజలపై ఆయన కరుణ ఉండాలని ఆకాంక్షించారు.

కలెక్టర్‌, ఎస్పీ నవమి శుభాకాంక్షలు

కడప సెవెన్‌రోడ్స్‌: కుటుంబ జీవన గమనంలో కష్ట సుఖాలు సహజమే అనే సత్యానికి సీతారాముల ఆదర్శ జీవిత సారాంశమే నిదర్శనమని కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ వేరు వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రజలపై శ్రీ రామరక్ష ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని కలెక్టర్‌, ఎస్పీ ఆకాంక్షించారు.

కడప సెవెన్‌రోడ్స్‌: కడప నగరంలో ఈ నెల 28న జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రగతి నివేదికలతో పాటు అభివృద్ధి ప్రతిపాదనల సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఉదయం 9.30 లకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని, జెడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

కడప ఎడ్యుకేషన్‌: ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలి విడత లాటరీలో 711 మంది విద్యార్థులు ఎంపికై నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్‌కుమార్‌ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు కేటాయించిన 25 శాతం సీట్లు లాటరీ ద్వారా ఎంపికై న విద్యార్థులతో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1206 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారని తెలిపారు. తొలివిడతలో కిలోమీటర్‌ పరిధిలో ఉన్న 711 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలివిడతలో 178 మంది ఎస్సీలకు, 19 మంది ఎస్టీలకు, 83 మంది మైనార్టీలకు, 305 మంది బీసీలకు, 125 మంది ఓసీలకు, ఒక్క సీడబ్ల్యూఎస్‌ఎన్‌ విద్యార్థికి ప్రవేశాలు కల్పించినట్లు వివరించారు. ఎంపికయిన విద్యార్థులు అన్ని రకాల ధ్రువ పత్రాలతో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఆయా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement