బాబు పాలనలో రైతులకు అష్ట కష్టాలు | - | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో రైతులకు అష్ట కష్టాలు

Mar 27 2026 8:54 AM | Updated on Mar 27 2026 8:54 AM

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

పులివెందుల రూరల్‌: చంద్రబాబు పానలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రకటనలతోనే గత రెండేళ్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో బుధవా రం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంద న్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కూడా కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతోందన్నారు.

ఆధ్యాత్మిక ఉత్సవాలకు ఆహ్వానం

ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కమలాపురంలో ప్రారంభం కానున్న ’దర్గా ఏ గఫారియా’ ఉరుసు ఉత్సవాలకు రావాలని దర్గా కన్వీనర్‌ షేక్‌ ఇస్మాయిల్‌ ఎంపీని ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement