కడప సెవెన్‌రోడ్స్: కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీ ఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్ రావు(బీజేపీ), ఫయాజ్ అహ్మద్ (వైఎస్సార్ సీపీ), జనార్దన్, జబీవుల్లా (టీడీపీ), గౌస్ పీర్ (కాంగ్రెస్), డా.శ్రీనివాసులు (ఆప్), విశ్వనాథ్ (జేఎస్పీ) తదితరులు పాల్గొన్నారు.
గనులు, క్వారీల నిర్వహణపై దృష్టి సారించాలి: జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనులు, క్వారీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో మైనింగ్ క్వారీ ల నిర్వహణ, ప్రధాన ఖనిజ బ్లాకుల కార్యాచరణ తదితర అంశాలపై జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావనలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.


