రాజంపేట: ఇటీవల హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న జస్టిస్ బాలాజి మెడమల్లి తొలిసారిగా స్వగ్రామమైన రాజంపేటకు విచ్చేశారు. ఈయనను రాజంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పచ్చా హనుమంతునాయుడు ఆధ్వర్యంలో న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో 3వ అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్, జూనియర్ సివిల్ జడ్జి రాజన్ ఉదయ్ ప్రకాశ్ , న్యాయవాదు లక్ష్మీనారాయణ, జాఫర్‌బాషా, సంగరాజు రామచంద్రరాజు, రఘునాథరెడ్డి, కృష్ణకుమార్, ఆనంద్, సురేంద్ర, స్ధానికులు డా.నవీన్, బాసినేని వెంకటేశ్వర్లు నాయుడు దగ్గుపాటి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.


