హనుమంతవాహనంపై శ్రీరాముడి తేజసం | - | Sakshi
Sakshi News home page

హనుమంతవాహనంపై శ్రీరాముడి తేజసం

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

వాల్మీకిపురం : పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement