ప్రజల ఇబ్బందులపై రైల్వే దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఇబ్బందులపై రైల్వే దృష్టి సారించాలి

Mar 26 2026 7:45 AM | Updated on Mar 26 2026 7:45 AM

రాజంపేట: నియోజకవర్గ పరిధిలో ఆర్‌యూబీ వల్ల గ్రామీణుల పడుతున్న ఇబ్బందులపై రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజంపేట–రాయచోటి సబ్‌వే, హస్తవరం ఆర్‌యూబీతో పాటు పలు ఆర్‌యూబీల స్ధితి గతులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రాజంపేట సబ్‌వే ద్వారా తాత్కాలిక రహదారి సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. త్వరలో గంగమ్మ జాతర జరగనున్న నేపథ్యంలో రాజంపేట స్టేషన్‌కు ఆవలివైపు ఉన్న వారు రాకపోకలు సాగించాలంటే తప్పనిసరిగా సబ్‌వే తప్పనిసరి అన్నారు. అలాగే రాజంపేట రూరల్‌ ఏరియాలోని హస్తవరం వద్ద నిర్మించిన రోడ్‌ అండర్‌ బ్రిడ్జిని మరమ్మతులు చేయించాలని తెలిపారు. హస్తవరం లెవల్‌ క్రాసింగ్‌ గేటు 110 వద్ద ఆర్‌యూబీని మంగళవారం రాజంపేట ఏడీఎన్‌ వాసుదేవనాయుడుతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు.గుంతకల్లు డివిజనల్‌ యూజర్స్‌ కమిటీ సభ్యుడు తల్లంభరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సెక్షన్‌లో ఆర్‌యూబీల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనరు దొడ్డిపల్లె భాస్కరరాజు, రైల్వేకోడూరు దళితనేత తిప్పన నాగభూషణం, నాయకుడు సానిగారి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement